కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన రుద్రా ఫౌండేషన్..
కాకతీయ, హనుమకొండ : ప్రజాకవి, విప్లవ కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు హనుమకొండ లో ఘనంగా జరిగాయి. కాళోజీ జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి రుద్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపికృష్ణ, సభ్యులు, స్థానిక గణ్యులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపికృష్ణ మాట్లాడుతూ.. కాళోజీ తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడారు. ఆయన రచనలు ఎల్లప్పుడూ నూతన తరానికి మార్గదర్శకాలు. సామాన్యుడి గుండె చప్పుడు విని, సమానత్వం.. న్యాయం సాధనకు కృషి చేసిన మహనీయుడు ఆయన అని అన్నారు. రుద్రా ఫౌండేషన్ తరపున సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ, కాళోజీ చూపించిన మార్గంలో నడుస్తామని స్పష్టం చేశారు. అంతేకాక, ప్రాంతీయతలు మోసం చేస్తే పొలిమేర వరకు తరిమికొడతాం.. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాణం తోనే పాతపెడతాం అని గర్జించిన కాళోజీ స్ఫూర్తిని స్మరించుకుంటూ, నేటితరం యువత తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలపై జాగృతమై సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సతీష్, రాజ్ కుమార్, వీరాచారి, రాజు, శ్యామ్, అరుణ్, అభిషేక్, సునీల్, పవన్, రాము, సాయి విక్రమ్, కుమార్, రామకృష్ణ, తిరుపతి, ధనుష్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.


