మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు…
పరకాల పశువుల అంగడి నుండి బస్సులు ప్రారంభం
జెండా ఊపి బస్సును ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి
కాకతీయ, పరకాల : తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతరకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. సోమవారం పరకాల పట్టణంలోని పశువుల అంగడి మైదానం నుండి మేడారం జాతరకు వెళ్లే ఆర్టీసీ బస్సులను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ.. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంద న్నారు.పరకాల మేడారం క్యాంపు నుంచి మొత్తం 160 ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించారు. సోమవారం నుంచి జనవరి 31 వరకు ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు కొనసాగుతాయని తెలిపారు.ఆర్టీసీ ప్రయాణం సురక్షితంగా,సౌకర్య వంతంగా ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళలు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.మేడారం జాతర ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆదివాసీ పండుగగా గుర్తింపు పొందిందని,ఈ పవిత్ర క్షేత్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింద న్నారు.శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై, ముఖ్యంగా పరకాల నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసి అసిస్టెంట్ ఇంజనీర్ రాజాశ్రీ, అసిస్టెంట్ మేనేజర్ కృష్ణ కుమారి,షెడ్ గార్డ్ రాజేందర్ రెడ్డి, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆర్టీసీ సిబ్బంది పాలన్నారు.


