epaper
Tuesday, March 10, 2026
epaper

మేడారం జాతరకు ఆర్‌టీసీ భారీ ఏర్పాట్లు

మేడారం జాతరకు ఆర్‌టీసీ భారీ ఏర్పాట్లు
మేడారం జాత‌ర‌కు ప్ర‌త్యేకంగా 4,000 ప్రత్యేక బస్సులు
జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకూ స‌ర్వీసులు
20 లక్షల మంది భక్తుల తరలింపే లక్ష్యం
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగింపు

కాకతీయ, ములుగు ప్రతినిధి : తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర–2026కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎస్‌ఆర్‌టీసీ అధికారులు తెలిపారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగుతుందని, ఈ వెసులుబాటుతో ఈసారి జాతరకు మహిళా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2026 మేడారం జాతరకు సుమారు 20 లక్షల మంది భక్తులను తరలించేందుకు టీఎస్‌ఆర్‌టీసీ సమగ్ర ప్రణాళిక రూపొందించింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 4,000 ప్రత్యేక బస్సులను జాతరకు కేటాయించారు. భక్తుల రద్దీని బట్టి అవసరమైతే బస్సుల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం మేడారం పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక బస్ స్టేషన్లు, క్యూలైన్లు, వేచి ఉండే షెడ్లు, విస్తృత పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎండ, వర్షం నుంచి భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు స్పష్టం చేశారు.

10 వేల మందికి పైగా సిబ్బంది విధుల్లో

జాతర నిర్వహణ కోసం 10,000 మందికి పైగా టీఎస్‌ఆర్‌టీసీ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. బస్సుల కదలికలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల భద్రత, సౌకర్యాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక పట్రోలింగ్ వాహనాలు ఏర్పాటు చేశారు. అలాగే సీసీటీవీ కెమెరాలతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. జాతర రోజుల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా బస్సుల రాకపోకలను క్షణక్షణం పర్యవేక్షిస్తామని అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో అదనపు బస్సులు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మేడారం జాతర నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మార్గాల్లో సాధారణ బస్సు సర్వీసులను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు టీఎస్‌ఆర్‌టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులు ముందుగానే ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మొత్తంగా మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే టీఎస్‌ఆర్‌టీసీ లక్ష్యం అని అధికారులు స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..!

బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..! మూల మలుపు వద్ద జరిగిన రోడ్డు...

కొమ్మాల గుడి వద్ద యువకులపై దాడి..

కొమ్మాల గుడి వద్ద యువకులపై దాడి.. నిందితుడిపై కేసు నమోదు కాకతీయ,గీసుగొండ:కొమ్మాల గుడి...

పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు

పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు శంక‌రా నేత్ర వైద్య‌శాల‌, రుద్ర ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో...

25 శాతం ఫెనాల్టీ మాఫీ చేయాలి

25 శాతం ఫెనాల్టీ మాఫీ చేయాలి 12 శాతం వడ్డీని ర‌ద్దు చేయాలి ములుగు...

ఆరోగ్యం కోసమే 5 కే రన్

ఆరోగ్యం కోసమే 5 కే రన్ ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే అభివృద్ధి నగర మేయర్...

విన్నపాలు విడిచి

విన్నపాలు విడిచి పన్నుల వేట! వెలవెలబోయిన జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్ .. పూర్తిస్థాయిలో హాజరుకాని అధికారులు ఆఫీస‌ర్ల...

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన బొమ్మినేని

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన బొమ్మినేని కాకతీయ, వరంగల్ : రాజ్యసభకు ఎంపికైన వేం...

బీజేపీతోనే నగరాభివృద్ధి

బీజేపీతోనే నగరాభివృద్ధి వరంగల్ అభివృద్ధిపై కేంద్రం నజర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కి నిధులు కేటాయించడం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img