ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఆటో డ్రైవర్ అరెస్టు
మహబూబాబాద్ బస్ స్టేషన్‌లో ఘటన
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ బస్ స్టాండ్‌లో ఆదివారం ఉదయం ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 9.50 గంటల సమయంలో ఆర్టీసీ బస్ డ్రైవర్ బి. సుధాకర్ ఇల్లెందు ట్రిప్ పూర్తి చేసుకుని మహబూబాబాద్ బస్ స్టాండ్‌లోని ఇల్లెందు పాయింట్ వద్ద బస్సును ఆపి కిందకు దిగారు. అనంతరం బస్సు వెనుక వైపు వెళ్తుండగా, టీజీ 26 టీ 3120 నంబర్ గల ఆటోను నడుపుతున్న ఎం.డి. షన్ను (28) వెనుక నుంచి డ్రైవర్‌ను డాష్ ఇచ్చాడు. దీనిపై డ్రైవర్ సుధాకర్ “ఎందుకు డాష్ ఇచ్చావు” అని ప్రశ్నించగా, ఆటో డ్రైవర్ ఆగ్రహంతో ఆయనపై దాడి చేశాడు. ఈ దాడిలో సుధాకర్ చెవికి గాయమై రక్తస్రావం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 100 డయల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాడికి పాల్పడ్డ ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎం. రాములు (టీఐ–3) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్ స్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఇలాంటి దాడులు జరగడం పట్ల ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తూ, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


