కాకతీయ, నేషనల్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్..ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం ఆలపించడం దేశవ్యాపత్ంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంటే..ఆ పార్టీ సీనియర్ నేత ఇలా పాడటం సంచలనం రేపింది. దీంతో ఈ అంశం కాస్త రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ స్పందించారు. దీని వల్ల కాంగ్రెస్ సభ్యులు, INDI కూటమి ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను అంటూ తాజాగా వ్యాఖ్యానించారు.
ఆర్ఎస్ఎస్ గీతం వివాదం..క్షమాపణలు చెప్పిన డిప్యూటీ సీఎం..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


