epaper
Monday, March 2, 2026
epaper

రూ. 736 కోట్ల లిక్కర్ సేల్‌

రూ. 736 కోట్ల లిక్కర్ సేల్‌

రాష్ట్ర ఖజానాకు కిక్కిచ్చిన కొత్త సంవత్సరం

న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు

గత ఆరు రోజుల్లోనే రూ.1,350 కోట్ల మద్యం విక్రయం

మూడ్రోజుల్లో దాదాపు రూ.వెయ్యి కోట్ల వ్యాపారం

డిసెంబ‌ర్‌లోనే రూ.3,805 కోట్ల సేల్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: కొత్త సంవత్సరం రాష్ట్ర ఖజానాకు కిక్కిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కనివినీ ఎరగని రీతిలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఆరు రోజుల్లోనే రూ.1,350 కోట్ల విలువైన మద్యం తాగేశారు. గత మూడు రోజుల్లోనే వెయ్యి కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మూడు రోజుల్లో 8.30 లక్షల లిక్కర్‌ కేసులు, 7.78 లక్షల బీర్ల కేసులు విక్రయించారు. నూతన సంవత్సరం సందర్భంగా వైన్​ షాప్​ల వద్ద జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయి. గతం కంటే ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. పలుచోట్ల రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. వైన్​ షాప్​ల వద్ద మందుబాబుల రద్దీ కనిపించింది. గతేడాది ఒక్క డిసెంబర్‌ నెలలోనే రూ.3,805 కోట్లు విలువైన 38.07లక్షల కేసుల లిక్కర్‌, 45.09లక్షల కేసులు బీర్లు అమ్ముడు పోయినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.

త‌గ్గేదేలే..

న్యూ ఇయ‌ర్‌కు స్వాగతం పలుకుతూ మద్యంప్రియులు ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు ఫుల్​గా తాగేశారు. డిసెంబర్ 31న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మద్యం ఏరులై పారింది. మధ్యాహ్నం నుంచే మందుబాబులు దుకాణాల వద్ద బారులు తీరారు. గతేడాది కంటే అధికంగా లిక్కర్​ అమ్మకాలు జరిగాయి. ఈ ఆరు రోజుల్లోనే ఏకంగా రూ.1350 కోట్ల విలువైన మద్యం తాగేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మద్యం సేల్స్ పెరిగాయి. 2025 చివరి రోజు 736 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. కొన్నిచోట్ల మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ ఘటనలు చోటుచేసుకున్నాయి.

2,731 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటిన వేళ శాంతి భద్రతల పరిరక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తాగి వాహనాలు నడుపుతున్న వారి కోసం హైదరాబాద్‌ వ్యాప్తంగా విస్తృతంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. పోలీసులను దూరం నుంచే చూసి పలువురు వెనక్కి తిరిగి పారిపోగా పలువురు మందు బాబులు చిక్కినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో 2,731 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్​ కమిషనరేట్ పరిధిలో 1,198, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 928, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 605 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లుగా పోలీసులు వివరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img