6 రోజుల్లో రూ.261 కోట్లు..
బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ జోరు
కాకతీయ, సినిమా డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ థియేటర్లలో విధ్వంసం సృష్టిస్తోంది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. ఈక్రమంలో తాజాగా చిరు మరో ఘనత సాధించారు. తన కుమారుడు రామ్‌చరణ్, సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ బెస్ట్ రికార్డులను చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బ్రేక్ చేశారు. రామ్‌చరణ్ నటించిన గ్లోబల్ బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చిరంజీవి క్రాస్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల పరంగా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు ఆర్ఆర్ఆర్ రూ. 20.75 కోట్లు (గ్రాస్) వసూల్ చేయగా, అదే సమయంలో చిరు రూ. 20.75 కోట్లు (గ్రాస్) సాధించింది. అలా చెర్రీ కెరీర్లో ఆల్‌టైమ్ రికార్డ్‌ను చిరు బ్రేక్ చేశారు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో గతేడాది రిలీజైన ‘ఓజీ’ సినిమాకు మొత్తం 2.78 మిలియన్ల (27.8 లక్షలు) టికెట్లు సోల్డ్ అయ్యాయి. ఆ సినిమాకు లాంగ్ రన్లో జరిగిన మొత్తం టికెట్ల అమ్మకాలు ఇవి. కానీ చిరంజీవి ఈ రికార్డును కేవలం 6 రోజుల్లోనే బ్రేక్ చేశారు. చిరు సినిమాకు ఇప్పటివరకు అదే బుక్‌మైషోలో 2.81 మిలియన్ల (28.1 లక్షలు) టికెట్లు అమ్ముడయ్యాయి


