కమ్యూనిటీ హాల్‌కు రూ.20 లక్షలు
మంజూరుకు ఎంపీ వద్దిరాజు హామీ
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రూ.20 లక్షలు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమకారుడు, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నవతన్ విజ్ఞప్తి మేరకు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రాఘవ సిఫార్సుతో ఈ నిధులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కొత్తగూడెంలో పర్యటిస్తున్న ఎంపీని కలిసిన నవతన్, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను సమగ్రంగా వివరించారు. వెంటనే స్పందించిన ఎంపీ తన ఎంపీ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. తన విజ్ఞప్తిని సానుకూలంగా స్వీకరించినందుకు ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, రాఘవలకు నవతన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


