కాకతీయ, కొత్తగూడెం రూరల్ : రోటరీ ఇండియా నేషనల్ సి ఎస్ ఆర్ 2025 సదరన్ రీజియన్ అవార్డ్స్ పాల్వంచ నవ లిమిటెడ్ పరిశ్రమ దక్కించుకుంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను శనివారం యాజమాన్యం విడుదల చేసింది. ఈ నెల 17న బెంగళూరులో చాంచారి పెవలియన్ వేదికగా జరిగిన రోటరీ ఇండియా నేషనల్ సి ఎస్ ఆర్ అవార్డ్స్ 2025 సదరన్ రీజియన్ కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డును ముఖ్యఅతిథి ప్రెసిడెంట్ ఫిక్సీ ఉమా రెడ్డి చేతుల మీదుగా నవ లిమిటెడ్ ప్రతినిధులు ప్రెసిడెంట్ యూనిట్ హెడ్ రేర్ అడ్మిరల్ ఎల్.వి.శరత్ బాబు, కంపెనీ సెక్రటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్ వి.ఎస్.రాజు, జనరల్ మేనేజర్ సి.ఎస్.ఆర్ ఎంజీఎం ప్రసాద్ అందుకున్నారు. ఆరోగ్యం, విద్య, జీవనోపాదులు ఇతర కార్యక్రమాలు ద్వారా సామాజిక అభివృద్ధికి ‘నవ లిమిటెడ్’ చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డు దక్కిందని వైస్ ప్రెసిడెంట్ యూనిట్ హెడ్ తెలంగాణ ఆపరేషన్స్ రేర్ అడ్మిరల్ ఎల్.వి శరత్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డైరెక్టర్ రోటరీ ఇంటర్నేషనల్ ఎఫ్ ఎల్ టి ఎల్ టి ఆర్ టి ఎన్ కే.పి నగేష్, ప్రెసిడెంట్ పిక్సీ ఉమా రెడ్డి, డి.జి వినోద్ సరౌజి, పిడిజి ఆర్.టి.ఎన్ జితేంద్ర అనేజ, ఆర్.టి.ఎన్ రామ్ కుమార్ శేషు, ఆర్.టి.ఎన్ త్రివిక్రమ్ జోషి తదితరులు పాల్గొన్నారు.
నవ లిమిటెడ్ కు రోటరీ ఇండియా నేషనల్ అవార్డ్స్
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


