భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్
ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా వైస్ చైర్మన్ బాజ్ పాయ్
కాకతీయ, వరంగల్ : భద్రకాళి దేవాలయం నుండి భద్రకాళి బండ్ వరకు ప్రతిపాదిత రోప్‌వే మరియు గ్లాస్ బ్రిడ్జ్ స్కై వాక్ ప్రాజెక్ట్ అమలు కోసం పలు సంస్థల ప్రతినిధులు తమ ప్రెజెంటేషన్లు సమర్పించారు. ఈ ప్రెజెంటేషన్లను కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కూడా) వైస్ చైర్మన్ చాహాత్ బాజ్ పాయ్ సమీక్షించారు.
ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ రోప్‌వే మరియు గ్లాస్ బ్రిడ్జ్ స్కై వాక్ ప్రాజెక్టులు అమలుతో పర్యాటక అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని, నగర సౌందర్యాన్ని మరింత పెంచుతాయని తెలిపారు. రోప్‌వే నిర్మాణానికి సంబంధించి సాంకేతిక, ఆర్థిక అంశాలను సమగ్రంగా పరిశీలించిన తరువాత తుది నిర్ణయం తీసుకునే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో కుడా పిఓ అజిత్ రెడ్డి, తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కుష్మాన్, ఐడెక్, ఫైన్ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


