ఫామ్‌లోనే రోహిత్
ఒక్క సిరీస్ ప్రదర్శన ఆధారంగా విమర్శించడం తగదు
హిట్‌మ్యాన్‌కు గిల్ మద్దతు
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది. దీనికితోడు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఆటతీరు, ఫామ్‌పైనా అందోళన నెలకొంది. ఈ సిరీస్‌లో భారీ అంచనాలతో బరిలో దిగిన రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. చేసిన తప్పు పదే పదే చేస్తూ చేతులారా వికెట్ కోల్పోయాడు. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ ఫామ్, ఫ్యూచర్‌పై కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ప్రెస్మీట్లో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
రోహిత్ భాయ్ ఫామ్‌లోనే ఉన్నాడు : గిల్
మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్ ఫామ్ గురించి గిల్‌ను విలేకర్లు ప్రశ్నించారు. దీనికి గిల్, రోహిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, ఒక్క సిరీస్ ప్రదర్శన ఆధారంగా అతడి ఫామ్‌ను ప్రశ్నించడం సరైనది కాదని గిల్ బదులిచ్చాడు. ‘రోహిత్ భాయ్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి అదే రిథమ్ కొనసాగిస్తున్నాడు. ఈ సిరీస్‌లో కూడా రోహిత్‌కు తొలి రెండు మ్యాచ్‌ల్లో మంచి ఆరంభాలే దక్కాయి. కానీ వాటిని భారీ స్కోర్లుగా మార్చలేకపోయాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఓపెనర్లు సెంచరీ సాధించడం కష్టం. కానీ రోహిత్ మాత్రం ఎల్లప్పుడూ దాని కోసమే ప్రయత్నిస్తాడు’ అని గిల్ రిప్లై ఇచ్చాడు.


