రహదారి భద్రత నియమాలు పాటించాలి
కాకతీయ, రామకృష్ణాపూర్ : ప్రతి ఒక్కరు రహదారి భద్రతా నియమాలు తప్పక పాటించాలని రామకృష్ణపూర్ పట్టణ ఎస్సై జే.శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ‘అరైవల్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రత నియమాలు పాటించడంలో నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయని గుర్తు చేశారు. ఆసుపత్రి డీవైసిఎంఓ మధు కుమార్,హెడ్ కానిస్టేబుల్ జంగు,సత్తయ్య,సిబ్బంది సతీష్,సమ్మయ్య పాల్గొన్నారు.


