మేడారం మార్గంలో రోడ్డు ప్రమాదం
కాకతీయ, మేడారం బృందం : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలకేంద్రానికి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాకు చెందిన భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న సీఐ నవీన్‌కుమార్ వెంటనే స్పందించి గాయపడినరిని తన పోలీస్ వాహనంలో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



