వరంగల్ శివారులో రోడ్డు ప్రమాదం!
బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ సమీపంలో లారీ–కారు ఢీ
కారులో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలు
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ మార్గంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. లారీని ఒక కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కారులో ప్రయాణిస్తున్న పలువురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వాహనాల వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన ఉపాధ్యాయుల పూర్తి వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.


