అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మంచిర్యాలకు చెందిన తల్లీ కూతుళ్లు మృతి
కాకతీయ, నేషనల్ డెస్క్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీకు చెందిన తల్లీ కూతుళ్లు రమాదేవి, తేజస్విలు అక్కడిక్కడే మృతి చెందారు. రెడ్డికాలనీకి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు విఘ్నేష్, రమాదేవిలు అమెరికాలో స్థిరపడిన కూతుళ్లు, స్రవంతి, తేజస్వి వద్దకు కొద్దిరోజుల క్రితం వెళ్లారు. ఈ క్రమంలో తేజస్వి పెద్ద కొడుకు నిశాంత్ బర్త్‌డే ఉండడంతో మొత్తం కుటుంబం అంతా కలిసి సరదాగా శుక్రవారం బయటకు వెళ్ళారు. శుక్రవారం అంతా బయట ఉండి..శనివారం తిరిగి వస్తుండగా…వారి కారు ప్రమాదానికి గురైంది. కారును టిప్పర్ గుద్దేయడంతో ప్రమాదం జరిగింది. ఇందులో రమాదేవి, తేజస్విలు అక్కడిక్కడే మృతి చెందారు. మిగతా కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.


