- డ్రైవర్ కు తప్పిన ప్రాణాపాయం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మండలం అలుగునూరులో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను కలవరపరిచింది. కాకతీయ బార్ సమీపంలో వేగంగా వస్తున్న కారు అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన కుక్కను తప్పించబోయి అదుపు తప్పింది. కారు నేరుగా బారికేడ్లను ఢీకొట్టడంతో ముందు భాగం ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు, కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రద్దీగా ఉండే ఈ మార్గంలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు నివారించేందుకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.


