కాకతీయ, మహబూబాబాద్ టౌన్ : సమాచారం హక్కు చట్టం ప్రతీ పౌరుడికి అవసరమని, దాని పట్ల అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర సమాచార కమిషన్ కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస రావు, మోహ్సినా పర్వీన్, దేశాల భూపాల్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ కలెక్టర్ కార్యాలయంలో వారికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో పోలీస్ గౌరవ వందన సమర్పణ చేశారు. మొక్కలను నాటారు. అనంతరం జిల్లాలోని పిఐఓస్, ఏపీఐఓస్, సంబంధిత అన్ని విభాగాల అధికారులతోకలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. సమాచార హక్కు చట్టం అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, రెవెన్యూ కె.అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


