కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని రామచంద్రు తండ గ్రామానికి చెందిన జాటోత్ సక్రు (60) గత ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా యాభై కేజీల బియ్యం అందించి భరోసా నిచ్చారు. ఈ కార్యక్రమంలో పానుగోత్ ప్రదీప్, దస్రు, హేమని, భోజ్య, గల్యా, నరేష్, రమేష్, బాలాజీ, చంద్రు, యాకు, సోమన్న, రఘు సదారి తదితరులు పాల్గొన్నారు.


