కాకతీయ, చెన్నారావుపేట: ఇందిరమ్మ ఇండ్లకు మొరం పోస్తున్నాం అనే సాకుతో ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇష్ట రాజ్యాంగ జెసిబి మరియు ట్రాక్టర్లతో ప్రభుత్వ భూమిలో అక్రమ మొరం దందా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తుంది. చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామంలో బొత్తకుంట శివారు ప్రభుత్వ భూమిలోని గుట్ట మట్టిని ప్రయివేట్ వ్యక్తులు అక్రమంగా తవ్వి 500-700 రూపాయలకు ట్రాక్టర్ చొప్పున మట్టిని అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు.
ఇట్టి విషయంపై గ్రామస్తులు రెవిన్యూ అధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను ఆపి జెసిపి ట్రాక్టర్ల యజమానులపై చర్య తీసుకుని ప్రభుత్వ భూమి గుట్టను కాపాడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


