epaper
Thursday, January 15, 2026
epaper

రేవంత్ రెడ్డి బజారు భాష మానుకోవాలి..

రేవంత్ రెడ్డి బజారు భాష మానుకోవాలి..
సీఎం భాషపై అసహ్యం వ్యక్తం చేస్తున్న‌ ప్ర‌జ‌లు
ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్
ఆయ‌న్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవ‌డం నీ వ‌ల్ల కాదు
రాజకీయాల్లో మీకు మిగిలింది మూడేళ్లే
బీఆర్ఎస్ ప్రజల పార్టీ : సిరికొండ మధుసూదనాచారి
హనుమకొండలో పార్టీ జిల్లా నేత‌ల‌తో క‌లిసి విలేక‌రుల స‌మావేశం

కాకతీయ, హనుమకొండ : ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడటం అత్యంత నీతిమాలిన చర్య అని తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్‌, ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి వాడుతున్న భాషపై ప్రజలు తీవ్ర అసహ్యం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి పరాన్నజీవి అయితే కేసీఆర్ స్వయం ప్రకాశమైన నాయకుడని వ్యాఖ్యానించారు. ‘‘నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్‌ను రానివ్వను’’ అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య హాస్యాస్పదమని అన్నారు. రాజకీయాల్లో ఆయనకు మిగిలింది ఈ మూడేళ్లే అన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

తెలంగాణ సాధించిన పోరాట యోధుడు కేసీఆర్

ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప పోరాట యోధుడు కేసీఆర్ అని, కేవలం పదేళ్లలోనే రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌–1గా నిలిపిన పాలనాదక్షుడని సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం కలగానే మిగిలేదని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం అని రెండేళ్లపాటు కేసీఆర్ ఓపికగా గమనించారని, ఈ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. గురుకుల హాస్టళ్లలో వరుస ఘటనలు, యూరియా కోసం రైతుల పడిగాపులు, ఫ్యూచర్ సిటీ, హిల్ట్ పేరుతో రియల్ ఎస్టేట్ దందాలు పెరిగాయని ఆరోపించారు.

అటకెక్కిన హామీలు

ఆరు గ్యారంటీలు, 420 హామీలు, జాబ్ క్యాలెండర్, మహిళలకు రూ.2,500, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు అన్నీ అటకెక్కాయని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన కేసీఆర్ కిట్ వంటి అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. అడవి సోమన్‌పల్లి చెక్‌డ్యామ్‌ను పేల్చివేశారన్న విషయాన్ని ‘వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్ స్వయంగా పరిశీలించి స్పష్టం చేశారని తెలిపారు. కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో చర్చకు రమ్మని సవాల్ చేసి, ఆ తర్వాత స్పెషల్ ఫ్లైట్‌లో కేరళకు వెళ్లిన చరిత్ర రేవంత్ రెడ్డిదేనని ఎద్దేవా చేశారు. ఓట్లు వేయించుకుని తరువాత పారిపోవడమే కాంగ్రెస్ రాజకీయ విధానమని విమర్శించారు. ఫార్ములా–ఈ రేస్‌ను రాష్ట్రానికి తీసుకొస్తే దుబారా అంటారని, కానీ ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సితో ఈవెంట్ పెట్టి సింగరేణి నిధులు ఖర్చు చేయడం దుబారా కాదా అని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీని మోసం చేశారని, తెలంగాణ సంపద సృష్టించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. మూడు లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో ఒక్క మేజర్ ప్రాజెక్ట్ అయినా చేపట్టారా అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం పరితపించే పార్టీ కాదని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే ప్రజల పార్టీ అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి భాషా వ్యవహారం మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్ చింతల సదానందం, కార్పొరేటర్ చెన్నం మధు, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, పులి రజినీకాంత్, శోభన్, నాయీముద్దీన్, రామ్మూర్తి, బుద్దె వెంకన్న, వినీల్ రావు, మూటిక రాజు యాదవ్, గండ్రకోట రాకేష్ యాదవ్, చాగంటి రమేష్, సంపతి రఘు, దేవమ్మ, జేకే, మునుకుంట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img