రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రేవంత్
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యా నాయక్
రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
కాకతీయ, రాయపర్తి: సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కొత్తరాయపర్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యా నాయక్, మాజీ టీపీసీసీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి తెలిపారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు భూక్య సమ్మయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు మచ్చ రమేష్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు చిర్ర మల్లయ్య, పాల్వంచ కోటేశ్వర్, గారె బిక్షపతి, గోవర్ధన్ రెడ్డి, ఉస్మాన్, వనజారాణి, ఎండీ అఫ్రోజ్, గౌస్, ప్రవీన్, యాదగిరి, సుదర్శన్ రెడ్డి, మహ్మద్ ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు.


