epaper
Monday, March 2, 2026
epaper

రేవంత్ స‌ర్కారు ఫెయిల్‌..!

  • ఆరు గ్యారంటీల‌ను అమ‌లులో వైఫ‌ల్యం
  • దొంగ హామీల‌తో గ‌ద్దెనెక్కిన రేవంత్ స‌ర్కారు
  • ప‌థ‌కాలు అమ‌లులో చేత‌కాక చ‌తికిల‌
  • బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై గంద‌ర‌గోళం సృష్టించింది
  • హుజురాబాద్ గ‌డ్డ నాకు కొత్త కాదు
  • ఇక్క‌డ బీఫాంలు ఇచ్చేది నేనే
  • మ‌ల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈట‌ల స్ప‌ష్టీక‌ర‌ణ‌

కాకతీయ, హుజురాబాద్ : ఆరు గ్యారంటీల‌ను అమ‌లు చేయడంలో రేవంత్ రెడ్డి స‌ర్కారు ఫెయిలైంద‌ని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఉద్ఘాటించారు. అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా ఎన్నిల ముందు అడ్డగోలుగా హామీలిచ్చింద‌న్నారు. ఆర్థిక ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేయ‌కుండానే హామీల‌ను గుమ్మ‌రించి ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ అధికారం ద‌క్కించుకుంద‌న్నారు. మోస‌పూరిత‌మైన హామీల‌తో అధికారంలోకి వ‌చ్చిన రేవంత్ స‌ర్కారు.. ఇప్పుడు హామీల‌ను అమ‌లు చేయ‌లేక చ‌తికిల ప‌డింద‌న్నారు.కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని మండిప‌డ్డారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఈ అంశంపై తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మొదటి నుంచి సపోర్ట్ చేసిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ చిత్తశుద్ధి లేకపోవడం లేకపోవడం వల్లనే అబాసుపాలైంద‌ని అన్నారు. కాంగ్రెస్ కొత్త పార్టీ కాదని, అనాలోచితంగా మూర్ఖంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఈ రిజర్వేషన్ల అంశం రాష్ట్రానికి సంబంధించింది కాదని, ఈ రాజ్యాంగ సవరణ అంశం, కేంద్రానికి సంబంధించిందని రాజ్యాంగబద్ధమా కాదా చూడాలని స్పష్టం చేశారు.

ఉద్యోగుల‌కు ఇబ్బందులు

జీతాలివ్వ‌కుండా.. పెన్ష‌న్లు ఇవ్వ‌కుండా అరిగోస పెడుతున్నాడ‌నే కేసీఆర్‌ను వ‌ద్ద‌నుకుని చ‌తికిల‌ప‌డి ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలుస్తూ అధికారంలోకి తీసుకొచ్చినందుకు రేవంత్ స‌ర్కారు కూడా ఇబ్బందులు పెడుతోంద‌న్నారు. ఇప్పుడు అప్పులున్నాయ‌ని చెబుతూ.. మొస‌లి క‌న్నీరు కారుస్తున్న కాంగ్రెస్‌కు.. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి తెలియ‌కుండానే ఎందుకు అడ్డ‌గోలుగా హామీలిచ్చిదంటూ ప్ర‌శ్నించారు. అనేక ర‌కాలైన హామీల‌తో అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా.. ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌న్నారు. 6 గ్యారంటీల హామీల అమ‌లు గురించి మంత్రుల‌కు మాట్లాడే ధైర్యం లేద‌ని అన్నారు.

బీసీల‌కు బీజేపీ అండ‌..!

బీసీలకు బీజేపీ అండగా ఉంటుందని ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాది నిర్మాణ‌మైంద‌న్నారు. హైదరాబాదులో పేదల గుడిసెలు కూలగొట్టింది ప్రజల బతుకులు నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఎప్పటికైనా ప్రజలకు తోడుగా అండగా ఉండేది బీజేపీయేన‌ని అన్నారు. పదవుల కంటే ప్రజలే ముఖ్యమ‌ని, కేసీఆర్ నియంతృత్వంగా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. ఆ ప్ర‌భుత్వంలో ఉన్న‌ప్పుడే ప్ర‌జ‌ల కోసం పాటుప‌డ్డాన‌ని గుర్తు చేశారు.

హుజురాబాద్ నాకుకొత్త కాదు.. బీ ఫాంలు ఇచ్చేది నేనే

హుజురాబాద్‌కు తానోదో కొత్త‌నాయ‌కుడి అన్న‌ట్లుగా.. త‌న‌కు ఇక‌హుజురాబాద్‌తో ఏం సంబంధం లేద‌న్న‌ట్లుగా ప్ర‌చారం చేస్తున్నార‌ని ఈట‌ల అన్నారు. హుజురాబాద్ గ‌డ్డ మీద నుంచే తన రాజ‌కీయం కొన‌సాగుతుంద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. స్థానిక ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా.. ఇక్క‌డ పార్టీ బీ ఫాంలు ఇచ్చేది మాత్రం తానేన‌ని అన్నారు. నాయ‌కులెవ‌రు.. కార్య‌క‌ర్త‌లెవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం...

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు…...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో...

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత...

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం ఎన్‌సీసీ సేవలను ప్రశంసించిన జిష్ణు దేవ్...

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర!

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర! దొడ్డిదారిన నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం నిరుద్యోగుల నోట్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img