epaper
Monday, March 2, 2026
epaper

ఫ్యూచర్‌ సిటీకి భవిషత్తు లేదు.. విజన్ లేని రేవంత్ రెడ్డి వలన ప్రజాధనం వృధా: కేటీఆర్

కాకతీయ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసమే హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆకాంక్ష నెరవేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఫార్మా సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్ లేని నాయకుడని..ఆయన తీసుకుంటన్న నిర్ణయాలతో ప్రజాధనం వ్రుథా అవుతుందన్నారు. ఫార్మా సిటీ కోసం భూములు ఇచ్చిన రైతులు మోసపోయారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి..దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ ప్రాజెక్టును ప్రవేశపెట్టారంటూ దుయ్యబట్టారు.

ఇది నిర్లక్ష్య నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే ఏమవుతుందో దానికి ఫ్యూచర్ సిటీ ప్రచారం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం, ఒక నిర్దిష్ట ప్రజా ప్రయోజనం కోసం సేకరించిన భూమిని ఇతరుల ప్రయోజనం కోసం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మళ్లించడం సాధ్యం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని ఉటంకిస్తూ, తాను రెండేళ్ల క్రితమే అసెంబ్లీలో ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించానని గుర్తుచేశారు. అయినా, రేవంత్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు పీఆర్ కోసం ఖర్చు చేసి, ఇప్పుడు తీవ్రమైన న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంటోందని, చివరికి అధికారులు కూడా దీనిని అంగీకరిస్తున్నారని అన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో 56 గ్రామాల పరిధిలో హైదరాబాద్ ఫార్మసిటీ కోసం 20,000 ఎకరాలతో ప్రతిపాదనలను తయారుచేసింది, స్థానిక రైతులు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వచ్చి తమ భూములను హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. అయితే కొంతమంది తమ భూములు ఇవ్వడం పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి రాగానే హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించిన ప్రతి ఎకరాన్ని తిరిగి రైతన్నలకు ఇస్తామని హామీలు ఇచ్చి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు స్నేహితుల కోసం అవే భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వారిని నిండా మోసం చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతన్నలు ఫార్మా కంపెనీల కోసం కేటాయించిన భూముల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఫార్మా సిటీ ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనంతో మౌలిక వసతుల కల్పనను ప్రారంభించినా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానిని పక్కనపెట్టి, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో భూములను అక్రమంగా రియల్ ఎస్టేట్ కు మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని, దీని వల్ల ప్రజలు, ముఖ్యంగా రైతులు నష్టపోతారని కేటీఆర్ హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు, రైతులకు స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img