epaper
Thursday, January 15, 2026
epaper

రేవంత్ బెస్ట్ యాక్ట‌ర్‌

రేవంత్ బెస్ట్ యాక్ట‌ర్‌
ఆయ‌న‌కు భాస్క‌ర అవార్డు ఇవ్వాలి
బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై కాంగ్రెస్‌వ‌న్నీ నాట‌కాలే
బీసీ బిల్లుపై అసెంబ్లీలో చ‌ర్చెందుకు పెట్ట‌లేదు?
కుల గణన రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే పార్టీ త‌రుపున సీట్లు కేటాయిస్తాం
ప‌ద‌వులు ముఖ్యం కాదు.. ప్ర‌జ‌ల్లో ఉండండి లీడ‌ర‌వుతారు
మీడియాతో చీట్‌చాట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు

కాక‌తీయ‌, హైదరాబాద్( జూలై 25 ) : సీఎం రేవంత్ రెడ్డి మంచి యాక్ట‌ర‌ని ఆయ‌న‌కు అత్తారింటికి దారేది సినిమాలో ఉన్న భాస్కర‌ అవార్డు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు ఎద్దేవా చేసారు. శుక్రవారం హైద‌రాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు కృషి చేస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ నాట‌కాల‌కు తెర‌లేపింద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని బీజేపీ అడ్డుకుంటున్న‌ట్లుగా ప్ర‌జ‌ల్లో దుష్ప్ర‌చారం చేస్తోంద‌ని అన్నారు. ఈవిష‌యంలో సీఎం రేవంత్ రెడ్డికి అత్తారింటికి దారేది సినిమాలో భాస్క‌ర్ అవార్డు ఇవ్వాల్సిందేనంటూ వ్యంగ్యంగా చెప్పారు. బీసీల‌కు నిజంగా రిజ‌ర్వేష‌న్లు కల్పించే ఉద్దేశమే ఉంటే.. బీసీ బిల్లును అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టి ప్రత్యేక సమావేశం ఎందుకు పెట్టలేదు? బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై ఆర్డినెన్సు తేవాల్సిన అవసరం ఏముంది? స‌మ‌గ్ర కుల గ‌ణ‌న చేసిన‌ట్లుగా చెబుతున్న రాష్ట్ర ప్ర‌భుత్వం ఆ రిపోర్టును ఎందుకు అసెంబీల్లో పెట్ట‌డం లేదు.? మిగతా కులాల లెక్క ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ కాకి లెక్క‌లు మానుకోవాల‌ని, కాక‌మ్మ క‌థ‌లు చెప్ప‌డం ఆపాల‌ని అన్నారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీ పార్టీ త‌రుపున 42శాతం టికెట్ల‌ను కేటాయింపు చేస్తామ‌ని వెల్ల‌డించారు.

వెన‌క‌బ‌డిన వ‌ర్గాల‌ను ఎద్దేవా చేసిన సీఎం

మోదీని కన్వర్షన్ బీసీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు వెనకబడిన కులాలను అవమానించేవిధంగా ఉన్నాయ‌ని రాంచంద‌ర్‌రావు అన్నారు. మోదీ కులాన్ని బీసీలో కలిపాకే ఆయన సీఎం అయ్యార‌ని గుర్తు చేశారు. మోదీ కులం గురించి మాట్లాడే ముందు రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పాల‌న్నారు. రాహుల్ గాంధీ తాత ఒక పర్షియన్.. రాహుల్ బ్రాహ్మిణ్ అని చెప్పుకోవ‌డం ఏంట‌ని అన్నారు. రాహుల్ గాంధీ బ్రాహ్మణ వర్గం ఎలా అవుతారంటూ ప్ర‌శ్నించారు. ఫొన్ ట్యాపింగ్ కేసు విష‌యంలో బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు నాట‌కాలాడుతున్నాయ‌ని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య మాంచి కెమిస్ట్రీ ఉంద‌న్నారు. ఆ రెండు పార్టీల మ‌ధ్య కెమిక‌ల్ బంధం రోజురోజుకు పెరుగుతోంద‌న్నారు. ప్ర‌జ‌ల ముందు షాడో బాక్సింగ్ ఫైట్ చేస్తున్నాయ‌ని అన్నారు.
బీజేపీకి మీడియాలో స్పేస్ దొరకకుండా చేయ‌డ‌మే ఆ రెండు పార్టీల ల‌క్ష్య‌మ‌ని అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో అధికారులను మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు, ఒక్క లీడర్ కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు.? ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి తెచ్చారో ఎందుకు వెల్ల‌డించ‌డంలేదు. రేవంత్ తన ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్ప‌డం వెనుక ఆంత‌ర్యం ఏంటంటూ ప్ర‌శ్న‌లు సంధించారు.

పోస్టుల కోసం నావద్ద‌కు రావొద్దు..!
పార్టీ పోస్టుల కొరకు నా దగ్గరికి రావద్దంటూ పార్టీ శ్రేణుల‌కు రాంచంద‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. ప్రజల వద్దకు వెళ్ళండి సమస్యలపై పోరాటం చేయండి అప్పుడే లీడర్ అవుతారు తప్ప పోస్ట్ వచ్చిన వారంతా లీడర్లు కాలేర‌ని, ఐదేళ్లుగా నాకు ఏ పోస్ట్ లేదని నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తేవడమే లక్ష్యమంటూ స్ప‌ష్టం చేశారు. రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తాను ఆ నెక్స్ట్ ఖమ్మం జిల్లా పర్యటన ఉంటుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img