epaper
Sunday, March 1, 2026
epaper

పదవీ విరమణ ప్రయోజనాలు ఉద్యోగుల హక్కు

పదవీ విరమణ ప్రయోజనాలు ఉద్యోగుల హక్కు
టీ–పీ–టీ–ఎఫ్ జిల్లా అధ్యక్షులు బాలష్టి రమేష్

కాకతీయ, నెల్లికుదురు : పదవీ విరమణ ప్రయోజనాలు ప్రభుత్వ బిక్ష కాదని, అవి ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కులని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బాలష్టి రమేష్ స్పష్టం చేశారు. టీపీటీఎఫ్ నెల్లికుదురు మండల శాఖ ఆధ్వర్యంలో ఆలేరులో నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి యాకయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాలష్టి రమేష్ మాట్లాడుతూ, దాదాపు 32 నుంచి 35 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పదవీ విరమణ బకాయిలను ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారిందన్నారు. బకాయిలు అందక అనేక మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులు అనారోగ్యంతో, అవమానాలతో జీవించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8 వేల మందికి పైగా ఉద్యోగులు పదవీ విరమణ చేశారని, ఒక్కొక్కరికి రూ.35 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు మొత్తం రూ.5 వేల కోట్లకు పైగా పదవీ విరమణ ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇవి దయతో ఇవ్వాల్సినవి కాదని, ఉద్యోగుల జీతాల నుంచే రికవరీ చేసిన జీపీఎఫ్, జీఐఎస్, టీఎస్‌జీఎల్‌ఐ వంటి నిధులేనని పేర్కొన్నారు. గ్రాట్యూటీ తప్ప మిగతా మొత్తమంతా ఉద్యోగుల సొంత సొమ్మేనని స్పష్టం చేశారు. కోర్టుల ఆదేశాలు, ప్రభుత్వ హామీలు, కమిటీల ఏర్పాటు ఉన్నప్పటికీ అమలు జరగకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 39 మంది పదవీ విరమణ ఉద్యోగులు మరణించారని తెలిపారు. ఇక మౌనం పాటించేది లేదని, సంఘటితంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వంపై ప్రజాస్వామిక ఉద్యమం చేపట్టి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. పదవీ విరమణ శిక్ష కాదని, అది ఉద్యోగులు–ఉపాధ్యాయుల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సంగా శ్రీనివాస్, బయ్యారం మండల జిల్లా కౌన్సిలర్ గోవర్ధన్, ఇనుగుర్తి మండల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, నెల్లికుదురు మండల కమిటీ సభ్యులు మధుసూదన్, సలీం, నవీన్, హరీష్, బిక్షపతి, రాజు, పద్మావతి, శ్రీనివాస్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img