పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదు
రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బలాస్టి రమేష్
కాకతీయ, నెల్లికుదురు : మండల పరిష త్ ప్రాథమిక పాఠశాల మునిగలవేడు లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోయిన రవీందర్ అధ్యక్షతన కడియం వెంకన్న పదవీ విరమణ సన్మాన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బలాస్టి రమేష్ మాట్లాడుతూ పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదని మార్చ్ 2024 నుండి ఇప్పటివరకు పదవి విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు వారికి చెల్లించవలసిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల 82 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు మరణించాలని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యా కమిషన్ సిఫారసుల ప్రకారంగా పాఠశాలల కుదింపు అనేది విద్యా కేంద్రీకరణకు దారితీస్తుందని తక్షణమే దానిమీద తెలంగాణలోని మేధావులతో విద్యా పరిరక్షణ ఉద్యమకారులతోఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి అందులో ఉన్న అసంబద్దాలను తొలగించాలని వారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ మండలాధ్యక్షులు ఎడెల్లి యాకయ్య, కొత్త వెంకటేశ్వర్లు, ఎండి సలీం, మధుబాబు, పాఠశాల ఉపాధ్యాయులు చిన్నారి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


