కాకతీయ, గీసుగొండ: గత నెల 22వ తేదీన స్మార్ట్ సిటీ పనుల్లో జాప్యం కావడంతో అద్వానంగా డివైడర్ నత్తనడకన సాగుతున్న పనులు అనే శీర్షికన కాకతీయ దినపత్రికలో వచ్చిన కథనానికి జీడబ్ల్యూఎంసీ అధికారులు స్పందించారు.
వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధిలోని కోటగండి వద్ద గల డివైడర్ పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉండగా కాకతీయ కథనంతో కదిలిన మున్సిపల్ యంత్రాంగం పిచ్చి మొక్కలను తొలగించి డివైడర్ సుందరీకరణ పనులు మొదలుపెట్టింది. దీంతో కాకతీయ దినపత్రికకు స్థానికుల నుండి అభినందనలు వెల్లువెత్తాయి.02


