కాకతీయ, నర్సంపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శనివారం వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జానాభా ప్రతిపాదికన జిల్లాలోని 11 జడ్పీటీసీ మరియు 11 ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు అధికారులు ఖరారు చేసి కేటాయించిన రిజర్వేషన్ లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రకటించారు. జడ్పీటీసీ 11 స్థానాలకు గాను జనరల్ 1, జనరల్ మహిళ 1, బీసీ జనరల్ 3, బిసి మహిళ 2 స్థానాలు, ఎస్సి జనరల్ 1, ఎస్సి మహిళ 1, ఎస్టీ జనరల్ 1, మహిళ 1 గా జడ్పీటీసీ స్థానాలు ఖరారు చేశారు…
జడ్పీటీసీ రిజర్వేషన్ వివరాలు..
నర్సంపేట – ఎస్టీ మహిళ
ఖానాపూర్ – ఎస్టీ జనరల్
వర్ధన్నపేట – ఎస్.సి మహిళ
గీసుకొండ – ఎస్.సి జనరల్
నల్లబెల్లి – బిసి జనరల్
నెక్కొండ – బిసి జనరల్
రాయపర్తి – బీసీ మహిళ
గెం – బీసీ మహిళ
పర్వతగిరి – బీసీ జనరల్
దుగ్గొండి – జనరల్
చెన్నారావుపేట- జనరల్ మహిళ
ఎంపీపీ రిజర్వేషన్ వివరాలు…
నర్సంపేట – ఎస్టీ జనరల్
ఖానాపూర్ – ఎస్టీ మహిళ
వర్ధన్నపేట – ఎస్సి జనరల్
గీసుకొండ – ఎస్.సి మహిళ
దుగ్గొండి – జనరల్
నల్లబెల్లి – బీసీ జనరల్
నెక్కొండ – బీసీ మహిళ
సంగెం – బీసీ జనరల్
పర్వతగిరి – బీసీ జనరల్
రాయపర్తి – బీసీ మహిళ
చెన్నారవుపేట- జనరల్ మహిళ
గా స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను ప్రకటించారు.


