కాకతీయ,లక్షెట్టిపేట : బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని దశాబ్దాలుగా పోరాటం చేయడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్ 9 ని విడుదల చేయగా,బీసీ రిజర్వేషన్ల పెంపును వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టులో కేసులు వేసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని లక్షెట్టిపేట పట్టణ,మండల బీసీ ప్రజాసంఘాల నాయకులు అన్నారు.రిజర్వేషన్లను పెంచాలని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఈనెల 18 న తెలంగాణా రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు.

బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు బీసీల పట్ల చిన్నచూపు చూస్తున్నాయని,ఇలాంటి సమయంలో బీసీల భవిష్యత్తు కోసం,అలాగే బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో ఈనెల 18 న నిర్వహించే రాష్ట్ర బంద్ లో భాగంగా అన్ని వర్గాల ప్రజలు లక్షెట్టిపేట మండల,పట్టణంలోని బీసీ సంఘాలు,బీసీ ఉద్యోగ సంఘాలు,బీసీ విద్యార్థి సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ ప్రజా సంఘాల కన్వినర్ కల్యాణం రవి,కుల సంఘాల నాయకులు అంకతి కిషన్,నడిమెట్ల రాజన్న, రాజగురు,కోమాకుల రవి,బండి రాజలింగు,చెరుకు వెంకన్న,తిప్పని మల్లేష్,ముత్తే ఆనంద్,చెరుకు తిరుపతి తదితరులు పాల్గొన్నారు..


