రిజర్వేషన్లు ఖరారు.. ఎన్నికలే తరువాయి..!
ఖమ్మం కార్పోరేషన్, మునిసిపాలిటీల్లో రిజర్వేషన్ల కేటాయింపు
బీసీలకు పెరిగిన గణనీయమైన ప్రాధాన్యం
ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తితో రిజర్వేషన్
అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టిన పార్టీలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రాష్ట్రంలో మరో విడత స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం, 2011 జనాభా లెక్కల ఆధారంగా ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌కు రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ శ్రీదేవి శుక్రవారం అధికారికంగా రిజర్వేషన్ జాబితాను విడుదల చేశారు. దీంతో ఖమ్మం జిల్లాలో పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఖమ్మం కార్పోరేషన్‌కు రిజర్వేషన్లు ఇలా..
కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, వాటిలో ఎస్టీ: 3 (జనరల్–2, మహిళ–1), ఎస్సీ: 7 (జనరల్–4, మహిళ–3), బీసీ: 20 (జనరల్–10, మహిళ–10), జనరల్ మహిళ: 16, అన్‌రిజర్వుడ్ (జనరల్): 14 గా కేటాయించారు. మేయర్ పదవికి సంబంధించిన రిజర్వేషన్‌ను మరో రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు సమాచారం.
ఏదులాపురం మున్సిపాలిటీలో
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. వీటిలో ఎస్టీ: 3 (జనరల్–2, మహిళ–1), ఎస్సీ: 7 (జనరల్–4, మహిళ–3), బీసీ: 6 (జనరల్–3, మహిళ–3), జనరల్ మహిళ: 9, జనరల్: 7 గా కేటాయింపులు జరిగాయి. ఈ విభజనతో మహిళా రిజర్వేషన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
కల్లూరు మున్సిపాలిటీ (20 వార్డులు) : ఎస్టీ: 3 (జనరల్–2, మహిళ–1), ఎస్సీ: 5 (జనరల్–3, మహిళ–2),
బీసీ: 2 (జనరల్–1, మహిళ–1), జనరల్ మహిళ: 6, జనరల్: 4,
మధిర మున్సిపాలిటీ (22 వార్డులు) : ఎస్టీ: 1 (జనరల్–1), ఎస్సీ: 6 (జనరల్–3, మహిళ–3), బీసీ: 4 (జనరల్–2, మహిళ–2), జనరల్ మహిళ: 6, జనరల్: 6
సత్తుపల్లి మున్సిపాలిటీ (23 వార్డులు) : ఎస్టీ: 1 (జనరల్–1), ఎస్సీ: 3 (జనరల్–2, మహిళ–1), బీసీ: 7 (జనరల్–4, మహిళ–3), జనరల్ మహిళ: 7, జనరల్: 5
వైరా మున్సిపాలిటీ (20 వార్డులు) : ఎస్టీ: 1 (జనరల్–1), ఎస్సీ: 5 (జనరల్–3, మహిళ–2), బీసీ: 4 (జనరల్–2, మహిళ–2), జనరల్ మహిళ: 6, జనరల్: 4
రాజకీయ పార్టీల్లో మొదలైన లెక్కలు
రిజర్వేషన్లు ఖరారుకావడంతో ఖమ్మం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది. ముఖ్యంగా బీసీ, మహిళా రిజర్వేషన్ ఎక్కువగా ఉండటంతో ఆ సామాజిక వర్గాలపై పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది. ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు కీలక మున్సిపాలిటీల్లో ఫలితాలు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


