నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి
కాకతీయ, మేడ్చల్ మల్కాజ్గిరి: మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అభివృద్ధి పనులకు తక్షణ ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్, మచ్చ బొల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్ మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మల్కాజ్గిరి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే జిల్లా కలెక్టర్కు ఫోన్ ద్వారా సూచనలు ఇచ్చి అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. మంత్రి తక్షణ స్పందనపై ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభివృద్ధికి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.


