ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
కాకతీయ,నెల్లికుదురు: గణతంత్ర దినోత్సవ వేడుకలు మానుకోట జిల్లా మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో విద్యాసంస్థలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, గ్రామపంచాయతీలలో సోమవారం మువ్వన్నెల జెండాలు ఎగురవేసి ఘనంగా గణతంత్ర ఉత్సవాలు నిర్వహించారు. తహసిల్దార్ ఆఫీస్ లో తహసిల్దార్ చంద నరేష్, మండల పరిషత్ లో ఎంపీడీవో కుమార్, పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ యాకయ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డా.రమ్య,సెర్ఫ్ లో ఏపీఎం నరేంద్ర కుమార్, ఎమ్మార్సీ ఎంఇఓ రాందాస్,కేజీబీవీ ప్రిన్సిపాల్ సుమలత, మోడల్ స్కూల్ ఉపేందర్ రావు,విద్యుత్ కార్యాలయంలో ఏ సింధు,నెల్లికుదురు జిపి లో సర్పంచ్ పులి వెంకన్న, బ్రాహ్మణ కొత్తపల్లి చిర్ర యాకాంతం గౌడ్, రావిరాల కత్తుల కళ్యాణి, హనుమాన్ నగర్ తండా(తారా సింగ్ బావి) భూక్య అశోక్, నైనాల యాసం సంధ్య,శ్రీరామగిరి మాధరి ప్రశాంత్ తో పాటు అన్ని గ్రామాల్లో ఆయా సర్పంచులు త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు.


