జిల్లా కోర్టులో గణతంత్ర వేడుకలు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో కోర్టు ప్రాంగణం దేశభక్తి వాతావరణంతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరితతో పాటు న్యాయమూర్తులు ఎం. రాజేందర్, కే. కిరణ్, కే. కవిత, ఏ. సుచరిత, బి. రవికుమార్, వి. వినయ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే ఏపీపీ పీవీడీ లక్ష్మి, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జి. గోపీ కృష్ణ, ప్రధాన కార్యదర్శి బాగం మాధవరావు, ఇతర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. ఈ వేడుకలు రాజ్యాంగ విలువలను గుర్తు చేస్తూ ఘనంగా ముగిశాయి.


