మత్తడికి మరమ్మతులు షురూ
కాకతీయ, మలహర్ : మండలంలోని కాపురం చెరువు మత్తడికి రైతుల అభ్యర్థన మేరకు ఆదివారం ఏ ఎమ్మార్ సంస్థ మరమ్మతు పనులు చేపట్టింది. కొద్ది రోజుల క్రితం ఆయకట్టు రైతులు ఇందారపు సమ్మయ్య, రాపాక రాజు, ఇందరపు సారయ్య, ఇందరపు గట్టయ్యలు ఏఎమ్మార్ వైఎస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. రైతుల అభ్యర్థన మేరకు వైస్ ప్రెసిడెంట్ కేఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో ఆయకట్టు రైతులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.


