జీఎస్టీ తగ్గింపుతో పేదలకి ఊరట
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి…
కాకతీయ, కరీంనగర్ : బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి శుక్రవారం స్థానిక ట్రాక్టర్ షోరూమ్‌లో వినియోదారుడు శ్రీకాంత్ కు కొత్త ట్రాక్టర్ అందించారు.ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో పన్నులు, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకినప్పుడు సామాన్య ప్రజలు ఇబ్బందుల్లో పడారని గుర్తుచేశారు.మోది ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగిస్తున్నదని ఆయన అన్నారు.సెప్టెంబర్ 22 నుండి అమలైన జీఎస్టీ తగ్గింపుతో వ్యాపారాలు, కొనుగోళ్లు పెరిగాయని, దినసరి అవసరాల వస్తువుల ధరలు తగ్గడం వల్ల జీవన వ్యయం గణనీయంగా తగ్గిందని గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు.ప్రధానమంత్రి మోది తీసుకున్న నిర్ణయాలు పేదల అభ్యున్నతికి దోహదపడుతున్నాయని, వర్తక వ్యాపారులకు కూడా మంచి రోజులు ప్రారంభమైందని ఆయన చెప్పారు.తెలంగాణలో ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పన్నులు, ధరలు పెరిగి సామాన్య జీవితాన్ని కష్టతరం చేస్తున్నాయని, మోది ప్రభుత్వం దీనిని సరిచేసిందని అన్నారు.కార్యక్రమంలో హుజురాబాద్ బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, మండల అధ్యక్షులు రాముల కుమార్, సీనియర్ నాయకులు నల్ల సుమన్, నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, పారుపల్లి కొండల్ రెడ్డి, తూర్పాటి రాజశేఖర్, మహేష్ రావుల, పున్నం పోచంపల్లి సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.


