ఎన్నికల విధుల నుంచి సడలింపు ఇవ్వాలి
తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ
కాకతీయ, కరీంనగర్ : గర్భిణీలు, ఫీడింగ్ మదర్స్, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, రిటైర్మెంట్‌కు సమీపంలో ఉన్న ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా అయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, పోలింగ్ బూత్‌ల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు. గతంలో కొన్ని బూత్‌ల వద్ద నీరు, కరెంట్ అందక ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఈసారి అలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అదేవిధంగా పోలింగ్ సిబ్బందికి రేమ్యునేషన్ అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉండేలా చూడాలని అ ప్రకటనలో కొరారు.


