epaper
Tuesday, March 10, 2026
epaper

శతాబ్ది స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు పునరంకితం

శతాబ్ది స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు పునరంకితం
శతాబ్ది ముగింపు సభతో శ్రేణుల్లో కొత్త ఉత్తేజం
మున్సిపల్ ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు
ఉపాధి హామీ రక్షణకు క్షేత్రస్థాయి ఆందోళనలు
ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు

కాకతీయ, ఖమ్మం : సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలు పార్టీ శ్రేణుల్లో గొప్ప పోరాట స్ఫూర్తిని నింపాయని, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజా ఉద్యమాలకు పునరంకితం కావాలని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు పిలుపునిచ్చారు. దేశం ఆర్థికంగా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, దేశ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక గిరిప్రసాద్ భవన్‌లో తోట రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో హేమంతరావు మాట్లాడారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 18న జరిగిన బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో అపూర్వ ఉత్సాహాన్ని తీసుకువచ్చిందన్నారు. ఆ సందర్భంగా జాతీయ స్థాయి సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాల అమలుకు పార్టీ పూనుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఉపాధి హామీ కోసం పోరాటాలు

వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించేందుకు క్షేత్రస్థాయి నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హేమంతరావు తెలిపారు. కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ విధానాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో కలిసి పనిచేస్తామని హేమంతరావు వెల్లడించారు. మున్సిపాలిటీలలో తమ బలాబలాలను బట్టి పోటీ ఉంటుందని, సిపిఐ అభ్యర్థిత్వాలపై ఇప్పటికే సమావేశాలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని రాజకీయ పార్టీలు తమను సంప్రదిస్తున్నాయని, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 12న జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పార్టీ యంత్రాంగమంతా సమ్మె ప్రచారంలో పాల్గొనాలని ఆయన సూచించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే పాలన సాగుతోందని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శతాబ్ది ఉత్సవాల ముగింపులో జరిగిన బహిరంగ సభ, ప్రదర్శనలతో పాటు తదనంతర కార్యక్రమాలను జయప్రదం చేసిన నాయకులు, కార్యకర్తలకు సమావేశం ధన్యవాదాలు తెలిపింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

స్టేడియంలో సింథటిక్ ట్రాక్

స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఫ‌లించిన మంత్రి తుమ్మల కృషి రూ.8.50 కోట్లతో నిర్మాణం.. శరవేగంగా...

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించాలి అర్హులకు న్యాయం జరిగేలా బాధ్యతగా...

పోడు భూమిలో కందకాలు..

పోడు భూముల్లో కందకాలు మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం తిప్పగుట్టలో ఉద్రిక్త పరిస్థితి.. అటవీ శాఖ...

మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలి

మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి మద్దతు ధర 2400...

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..!

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..! పరీక్షల సమయంలోనే ఇళ్లు కూల్చడం దారుణం బాధితుల బాధను రాజకీయ...

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు..!

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు..! కొత్తూరు తండాలో 20 కుటుంబాలు పార్టీ తీర్థం కాకతీయ, కారేపల్లి...

సీఎం రిలీఫ్ ఫండ్‌తో లక్ష సాయం..!

సీఎం రిలీఫ్ ఫండ్‌తో లక్ష సాయం..! అనారోగ్యంతో ఉన్న వార్డు సభ్యుడికి చెక్కు...

గ్యాస్ ధరలు తగ్గించాలని దిష్టిబొమ్మ దహనం..!

గ్యాస్ ధరలు తగ్గించాలని దిష్టిబొమ్మ దహనం..! పి ఓ డబ్ల్యూ ఆధ్వర్యంలో నిరసన కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img