epaper
Monday, March 2, 2026
epaper

డీప్‌ఫేక్‌లకు రెడ్ సిగ్నల్‌.. లోక్‌సభలో కొత్త బిల్లు సంచలనం!

డీప్‌ఫేక్‌లకు రెడ్ సిగ్నల్‌.. లోక్‌సభలో కొత్త బిల్లు సంచలనం!
ఏఐ యుగంలో అదుపు తప్పుతున్న డీప్‌ఫేక్ టెక్నాలజీ
డీప్‌ఫేక్‌లను కట్టడి చేసేందుకు లోక్‌సభలో కీలక బిల్లు
అనుమతి లేకుండా నకిలీ కంటెంట్ సృష్టించినా, ఫార్వర్డ్ చేసినా క‌ఠిన శిక్ష‌లు

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : ప్రస్తుత కృత్రిమ మేధస్సు విప్లవంలో రోజురోజుకు ఒక కొత్త ఆవిష్కరణ వెలుగులోకి వస్తోంది. కానీ ఈ అభివృద్ధికి తోడు ప్ర‌మాదాలు కూడా పెరుగుతున్నాయి. ఏఐ యుగంలో వేగంగా పెరుగుతున్న సాంకేతిక ప్రమాదం డీప్‌ఫేక్‌. నకిలీ వీడియోలు, ఆడియోలు, ఫోటోలు… అసలు వ్యక్తి చేయని పనిని చేసినట్లు చూపించడం… అసలే మాట్లాడని మాటలు మాట్లాడినట్లు హావభావాలతో రూపొందించడం.. ఇవన్నీ ఇప్పుడు కొన్ని నిమిషాల్లోనే సాధ్యమవుతున్నాయి. ఈ డీప్‌ఫేక్ వీడియోల వ‌ల్ల సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో డీప్‌ఫేక్‌లను కట్టడి చేయడానికి లోక్‌సభలో ఒక కీలక బిల్లు ప్రవేశపెట్టబడింది. శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే ప్రైవేటు మెంబర్ బిల్లు రూపంలో ఈ ప్రతిపాదనను సమర్పించడంతో పార్లమెంట్‌లో కొత్త చర్చకు ఊపు వచ్చింది. డీప్‌ఫేక్ కంటెంట్ తయారు చేయడానికి సంబంధిత వ్యక్తి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి చేయాలని ఆయన స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఎవరినైనా టార్గెట్ చేస్తూ నకిలీ కంటెంట్ సృష్టిస్తే, అది నేరపూరిత చర్యగా పరిగణించి కఠిన శిక్షలు విధించేలా చట్టం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

కేవలం తయారు చేయడమే కాదు… డీప్‌ఫేక్ వీడియోలు లేదా ఆడియోలను ఫార్వర్డ్ చేసిన వారిపైనా శిక్షల ప్రక్రియ ఉండాలని బిల్లులో పేర్కొనడం గమనార్హం. ఎందుకంటే ఇలాంటి నకిలీ కంటెంట్ వ్యాప్తి చెందడంలో షేర్ చేసే వారే కీలక పాత్ర పోషిస్తున్నారు. వేధింపులు, మోసాలు, తప్పుడు ప్రచారం వంటి అక్రమ కార్యకలాపాలకు డీప్‌ఫేక్‌లను వినియోగిస్తున్న నేపథ్యంలో దీన్ని కఠినంగా అరికట్టాల్సిన సమయం వచ్చిందని శిందే హెచ్చరించారు.

డీప్‌ఫేక్‌లు వ్యక్తిగత గోప్యతకు మాత్రమే కాదు, జాతీయ భద్రతకు కూడా ముప్పుగా మారుతున్నాయని ఆయన గుర్తుచేశారు. ఏపీవేగంగా అభివృద్ధి చెందడం, ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడం మరింత సులభమవడం వల్ల నకిలీ కంటెంట్ తయారీ ప్రమాదకరంగా పెరిగిందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా గతంలో డీప్‌ఫేక్‌ల ప్రమాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నకిలీ వీడియోలు, ఆడియోల ద్వారా సమాజంలో కల్లోలం సృష్టించే ప్రయత్నాలు దేశ భద్రత, సమాజ శాంతి రెండింటినీ ప్రభావితం చేస్తున్నాయని ఆయన వార్న్ చేశారు. ఇక ఇప్పుడు లోక్‌సభలో ప్రవేశించిన ఈ కొత్త బిల్లు డీప్‌ఫేక్‌లకు నిజంగా రెడ్ సిగ్నల్ అయ్యేటట్లే క‌నిపిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img