‘జన నాయగన్’ ఆడియో లాంచ్‌కు రికార్డు క్రౌడ్
మలేసియాలో ఘనంగా వేడుక.. 85 వేల మందికిపైగా హాజరు
మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు
జనవరి 9న సినిమా విడుదల
కాకతీయ, సినిమా : తమిళ స్టార్ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్ర ఆడియో లాంచ్ వేడుక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. డిసెంబర్ 27, 2025న మలేసియాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు.
ఈ ఆడియో లాంచ్‌కు సుమారు 85 వేల మందికిపైగా హాజరుకావడంతో ఈ ఈవెంట్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇంత భారీ సంఖ్యలో అభిమానులు ఒకే వేదికపై చేరుకోవడం అరుదైన విషయంగా నిర్వాహకులు పేర్కొన్నారు.
బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
అసాధారణ జనసందోహం నేపథ్యంలో ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ వేడుక మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. దీంతో విజయ్ క్రేజ్ మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జన నాయగన్’ చిత్రం జనవరి 9, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.


