కాంగ్రెస్ ప్రభుత్వం తోనే గ్రామాలలో నిజమైన అభివృద్ధి
నడికూడ మండలంలోని పలు గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజ్
పనులకు శంకుస్థాపన చేసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, పరకాల: నడికూడ మండలంలోని చర్లపల్లి, పులిగిల్ల ,రాయపర్తి, నర్సక్కపల్లి,చౌటుపర్తి, నడికూడ ,ధర్మారం, కంఠాత్మకూర్ గ్రామాలలో 1కోటి43 లక్షలతో చేపట్టిన సిఆర్ఆర్ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ఎస్సీ కాలనీలలో చేపట్టిన సీసీ రోడ్లు,డ్రైనేజ్ పనులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం వెంకటేశ్వర్లపల్లి గ్రామం నుండి నర్సింగాపూర్ గ్రామం వరకు ఎస్టిఎస్డిఎఫ్ నిధులతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో అంగన్వాడి సెంటర్ ను ఎమ్మెల్యే రేవూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే గ్రామాల నిజమైన అభివృద్ధి మహర్దశను చేరుకుంటుందని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని,ముఖ్యంగా ఎస్సీ కాలనీలలో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు.పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు అభివృద్ధి పేరుతో దోచుకున్నారని,ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పరకాల డైరీ ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులు,200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు బీమా, సన్న వడ్లకు రూ 500 బోనస్, మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ, వడ్డీ లేని రుణాలు, శ్రీనిధి రుణాలు, ఇందిరమ్మ ఇల్లు, సీఎంఆర్ఎఫ్ ,కళ్యాణ లక్ష్మి, తదితర సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందజేస్తున్నామనితెలిపారు.అలాగే వెంకటేశ్వర్ల పల్లి, నార్లాపూర్, రాయపర్తి, చర్లపల్లి, నడికూడ గ్రామాలలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.రైతులు దళారులను నమ్మి మొసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


