కాకతీయ, సినిమా: మాస్ రాజా రవితేజ మరోసారి తన ఎనర్జీతో తెరపై మాసివ్స్ అందించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ‘మాస్ జాతర’ కాగా.. మరొకటి ‘RT76’. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన మాస్ జాతర అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్. ట్రైలర్, పాటలకు ఇప్పటికే అద్భుత స్పందన వచ్చింది. ప్రమోషన్స్ ద్వారా సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు మేకర్స్.
‘RT76’ స్పెయిన్ షెడ్యూల్ కంప్లీట్
మాస్ జాతర రిలీజ్‌కి ముందే ` RT76` బజ్ ఆన్ అయింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మాస్ జాతర ప్రమోషన్లలో వేగం పెంచారు రవితేజ. అదేవిధంగా మరోవైపు RT76 షూటింగ్ లో కూడా పాల్గొంటూ ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో రవితేజ సరసన ‘అమిగోస్’ ఫేమ్ ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ షూట్ స్పెయిన్‌లో కొనసాగింది. తాజాగా అక్కడ ఒక సాంగ్‌తో షెడ్యూల్ పూర్తయింది.
ఈ అప్‌డేట్‌ని హీరోయిన్ ఆషికా రంగనాథ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆమె పోస్ట్‌తో మూవీ లవర్స్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. రవితేజతో ఆషికా జోడీ ఫ్రెష్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా, ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్‌లను బట్టి చూస్తే, ఇది మాస్ రాజా స్టైల్‌లో పవర్‌ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ అవుతుందని చెప్పొచ్చు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న RT76 మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇందులో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. అతని పాత్ర మాస్ టచ్‌తో పాటు ఎమోషనల్ డెప్త్ కూడా కలిగి ఉందని సమాచారం.


