రేపు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్
సంఘం అధ్యక్షుడు బత్తల రమేష్ బాబు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రేపు (శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులను బంద్ చేయనున్నట్లు సంఘం ప్రకటించింది. సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు మాట్లాడుతూ. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాకు ప్రతి నెల రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తామని, కమీషన్ పెంచుతామని హామీ ఇచ్చింది.
ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడిచినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. దుకాణాల అద్దె, బియ్యం దిగుమతి ఛార్జీలను ప్రభుత్వం భరించాలి అని డిమాండ్ చేశారు. డీలర్ల హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగుతుందని, సమస్యలు పరిష్కరించే వరకు తమ ఆందోళనలు ఆగవని బత్తుల రమేష్ బాబు స్పష్టం చేశారు.


