కాకతీయ, తెలంగాణ బ్యూరో: సొంత పెద్దనాన్న నుంచి అత్యాచార వేధింపులు భరించలేక ఓ బాలిక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన కొంపల్లి పరిధిలోని పోచమ్మగడ్డ ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ జిల్లాలోని వర్ని ప్రాంతానికి చెందిన దంపతులు బతుకుదెరువు కోసం కోంపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరి పెద్ద కూతురు సుచిత్ర సమీపంలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. బాలిక తండ్రి గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అంతకు ముందు తన అన్నతో కలిసి ఆయన మేడ్చల్ లో ఫైనాన్స్ లో లోన్ తీసుకున్నాడు. దీంతో తరుచుగా తన తమ్ముడి ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ బాలికను వేధించేవాడు. వాటిని తట్టుకోలేక మనోవేదనకు గురైన బాలిక ఇంట్లో ఉరేసుకుని మరణించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


