- అంగన్వాడీ టీచర్ కుమారుడిపై ఫిర్యాదు
- వరంగల్ ఖనాపూర్ మండలంలో ఘటన
కాకతీయ, నర్సంపేట : తన నాలుగేళ్ల కుమార్తెపై అంగన్వాడీ టీచర్ కుమారుడు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఫిర్యాదు చేసింది. బాధిత చిన్నారికి ప్రస్తుత చికిత్స అందజేస్తున్నట్లు తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘటనపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ కు పని నిమిత్తం వెళ్తూ.. తన కుమార్తెను తన తల్లి ( అమ్మమ్మ) వద్ద ఉంచింది. ఈ క్రమంలో ఈ నెల25 శనివారం ఉదయం ఎప్పటిలాగానే తన కుమార్తెను వాళ్ళ అమ్మమ్మ అంగన్ వాడిలో అప్పగించింది.
అంగన్ వాడీ టీచర్ కుమారుడు తన తల్లి లేని సమయంలో చిన్నారిని గదిలో అడ్డుగా కట్టిన పరదా చాటుకు తీసుకెళ్ళి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఘటన జరిగిన రోజు సాయంత్రం ఇంటికీ కడుపు నోప్పి అంటూ ఏడ్చుకుంటూ రావడంతో చిన్నారి కడుపును పరిశీలించగా గాయాలు కనిపించాయి. విషయాన్ని వృద్ధురాలు తన కుతూరుకు ఫోన్ ద్వారా తెలియజేయడంతో వెంటనే హైదరాబాద్‌నుంచి ఇంటికి చేరుకుంది. చిన్నారి ప్రయివేటు భాగాల్లో గాయాలు కనిపించడంతో.. తన కూతురుపై అత్యాచారం జరిగిందని నిర్ధారణకు వచ్చింది. స్థానిక మహిళలతో కలిసి మహిళల ఖానాపురం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రఘుపతి వెల్లడించారు.


