కాకతీయ, వెబ్‌డెస్క్, Rana Daggubati: సినీ హీరో రానా దగ్గుబాటి ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన వ్యవహారంలో రానా దగ్గుబాటిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న రెమ్యూనరేషన్, కమీషన్లపై ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు. గతంలో ముందస్తు బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో హాజరుకాలేనట్లు రానా ఈడీని కోరిన సంగతి తెలిసిందే. దీంతో రానాను నేడు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నటులు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రకాశ్ రాజ్ ను సుమారు 6గంటల పాటు, విజయ్ దేవరకొండను 4 గంటలపాటు ప్రశ్నించారు అధికారులు. ఇక ఈ నెల 13న విచారణకు రావాలని మంచు లక్ష్మీని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో వచ్చిన ఆదాయం, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాలపై ఈడీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. కొంతమంది సినీ ప్రముఖులు ఈ యాప్స్ కు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ భారీగా డబ్బులు సంపాదించారని ఇందులో భారీగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే వారికి నోటీసులు ఇస్తూ విచారణకు పిలుస్తున్నారు. కాగా ఈ నెల 13వ తేదీ మంచు లక్ష్మీ కూడా విచారణ హాజరుకానున్నారు. ఆమెకు సంబంధించిన లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. టాలీవుడ్ ప్రముఖులు ఈ కేసులో వరుసగా విచారణకు హాజరుకావడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా భవిష్యత్తులో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.


