మండల వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు
కాకతీయ, బోనకల్ : మండలంలోని అన్ని గ్రామాలు, ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రార్థనలు నిర్వహించి, మసీదుల్లో ప్రత్యేక నమాజ్ చేశారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సోదరభావాన్ని చాటుకున్నారు. పండుగ సందర్భంగా ఇళ్లలో ప్రత్యేక వంటకాలు సిద్ధం చేసి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. చిన్నారులు కొత్త దుస్తులు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.


