రంజాన్ సోదరభావానికి ప్రతీక
పండుగను ఐక్యతతో జరుపుకోవాలి
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుండాల కృష్ణ
కాకతీయ, ఖమ్మం: ముస్లిం సోదరుల పెద్ద పండుగ రంజాన్‌ను ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుండాల కృష్ణ, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అన్నారు. ఈ పండుగ మానవాళికి శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు మానవాళి సుఖశాంతుల కోసం ప్రార్థనలు చేయాలని ఆకాంక్షించారు. త్రీ టౌన్ ప్రాంతంలోని 32వ డివిజన్‌లో పార్టీ డివిజన్ అధ్యక్షుడు నన్నే పఠాన్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో 50 మందికి రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పండుగలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నామవరపు సతీష్ తదితరులు పాల్గొన్నారు.


