కాకతీయ, సినిమా డెస్క్: టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ అల్లు కుటుంబంలో విషాదం నెలకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ నానామ్మ, అల్లు అర్వింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ 94 కన్నుమూయడంతో ఆ కుటుంబం తీవ్ర దుఖంలో మునిగింది. వ్రుద్ధ్యాప్య సమస్యలతో బాధపడుతున్న కనకరత్నమ్మ శనివారం తెల్లవారుజామున మరణించారు. దీంతో అల్లు కుటుంబంతోపాటు మెగా కుటుంబంలో విషాదం నెలకొంది. ఇప్పటికే అరవింద్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవితోపాటు పలువురు ప్రముఖలు వచ్చి సంతాపం తెలుపుతున్నారు.
అయితే తన అమ్మమ్మ మరణించిందన్న విషయం తెలుసుకున్న నటుడు రామ్ చరణ్ మైసూరులోని తన సినిమా షూటింగ్ ను మధ్యలోనే ఆపేసి వెంటనే హైదరాబాద్ కు వచ్చారు. తర్వాత అమ్మమ్మ మృతదేహాన్నిచూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మేనమామ అరవింద్ తోపాటు అల్లు అర్జున్ ను రామ్ చరణ్ ఓదార్చారు. పెద్ది సినిమా షూటింగ్ ను మధ్యలోనే ఆపేసి వచ్చిన రామ్ చరణ్ మళ్లీ మైసూర్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది.


