ఘనంగా రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
తొర్రూరు కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్
కాకతీయ, తొర్రూరు : అమెరికాలో ప్రముఖ వైద్య నిపుణులు, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ హనుమాండ్ల రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు తొర్రూరులో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాజేందర్ రెడ్డి తొర్రూరుతో పాటు పలు ప్రాంతాల్లో ఆసుపత్రులు నిర్మించారని తెలిపారు. అలాగే విద్యాభివృద్ధి కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి, ఆధ్యాత్మికతను పెంపొందించేలా పలుచోట్ల దేవాలయాల నిర్మాణానికి ఆయన తోడ్పాటు అందించారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన రాజేందర్ రెడ్డి పేదల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని నాయకులు అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య, చాపల బాపురెడ్డి, డాక్టర్ పొనుగొటి సోమేశ్వరరావు, మంగళపల్లి రామచంద్రయ్య, జీనుగా సురేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పింగిలి ఉష, ఏఎంసీ డైరెక్టర్లు కందాడి అచ్చిరెడ్డి, కంచర్ల వెంకట చారి, సర్పంచ్లు బానోత్ శీను, బంగారు రమేష్, నాయకులు జలకం శ్రీనివాస్, నర్కూటి గజానంద్, దొంగరి రేవతి శంకర్, బిజ్జాల అనిల్, కుషాల్, ముద్దసాని సురేష్, వెలుగు మహేశ్వరి, గూడెల్లి రామచంద్రయ్య, మనోహర్, అజ్మీర రమేష్, మహేష్ యాదవ్, హరిత, అనిత, రాణి, యశోద, శోభ, లక్ష్మి, రేణుక, నడిగడ్డ మధు తదితరులు పాల్గొన్నారు.


