వంద కోట్ల క్లబ్బులో రాజా సాబ్..
కాకతీయ, సినిమా డెస్క్ : బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల మార్కును టచ్ చేయడం అంటే ఒకప్పుడు అది పెద్ద గగనం. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా పెరిగాక, మొదటి రోజే ఆ మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడం ఒక ట్రెండ్ గా మారింది. లేటెస్ట్ గా ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ కూడా ఈ ఎలైట్ క్లబ్బులో చేరిపోయింది. సినిమాపై మిక్స్డ్ టాక్ నడుస్తున్నా, వసూళ్ల విషయంలో మాత్రం ప్రభాస్ తన సత్తా చాటుతున్నాడు. మేకర్స్ అధికారికంగా వంద కోట్ల పోస్టర్ రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ లెక్కలపై పెద్ద చర్చ నడుస్తోంది. నిజానికి రాజా సాబ్ కి వచ్చిన టాక్ చూస్తే ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లు వస్తాయని చాలా మంది ఊహించలేదు. డార్లింగ్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అయింది. దీనికి తోడు సంక్రాంతి సెలవులు కలిసి రావడం ఈ వసూళ్లకు ప్రధాన కారణం. గతంలో బాహుబలి 2, సాహో వంటి సినిమాలతో ప్రభాస్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇప్పుడు రాజా సాబ్తో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకున్నాడు. అయితే ఈ వసూళ్లు లాంగ్ రన్ లో ఎంతవరకు నిలకడగా ఉంటాయనేదే ఇప్పుడు అసలైన పాయింట్. కేవలం ప్రభాస్ క్రేజ్ తోనే ఈ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల అంచనా.


